News
మహిళలకు చదువు ముఖ్యం: లోక్‌సభ స్పీకర్
మహిళలకు చదువు అనేది ముఖ్యమైనదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. కోఠి జాంబాగ్‌లోని వివేకవర్ధిని పాఠశాల శతాబ్ది ఉత్సవాలలో సుమిత్రా మహాజన్, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. నిజాం కాలంలోనే మహిళల విద్య కోసం వివేక వర్ధిని కళాశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతి బాలిక చదువుకోవాలని సూచించారు. మహారాష్ట్రీయులు ఎక్కడ ఉన్నా అక్కడి ప్రజలతో త్వరగా కలిసిపోతారని చెప్పారు. ఎంపీ కవిత మంచి నాయకురాలు అని కొనియాడారు. కొద్ది రోజుల క్రితం తాము యూరప్‌కు వెళ్లినప్పుడు కవిత భారతీయ మహిళల గురించి గొప్పగా చెప్పారని తెలిపారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








